పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ ఫహద్ ఫాసిల్ పుష్పతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ఫహాద్ తన తదుపరి చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తో పని చేయడానికి సిద్ధంగా వున్నారు.
ప్రొడక్షన్ హౌస్ లో వస్తున్న 96 వ చిత్రమిది .సుధీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ గేర్ అనే టైటిల్ ను ప్రకటించారు మేకర్స్.టైటిల్ పోస్టర్ లో లుంగీ కట్టుకున్న ఫహద్ ఫాసిల్ జీపుపై నిలబడి ప్రజలను అభివాదం చేస్తూ కనిపించారు.పోస్టర్ లో సూచించినట్లుగా, టాప్ గేర్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది.
రేపటి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఆర్‌బి చౌదరి సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్ నిర్మాణ విలువలతో రూపొందనుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.