ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ గడువు రేపటితో ముగియనుంది.ఇటీవల తల్లి మృతిచెందడంతో మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు.
గడువు ముగియనున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల లోపు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ముందు అనంతబాబు హాజరుకానున్నారు.
మరోవైపు, అనంతబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో రెండు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై న్యాయస్థానం రేపు వాదనలు విననుంది.అయితే, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు మే 23 నుంచి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.







