తెలుగు బుల్లితెరపేక్షకులకు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు నిరుపమ్ పరిటాల.
మరి ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యాడు.చాలామంది నిరుపమ్ పరిటాల అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం చాలు ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు.
అంతేకాకుండా బుల్లితెర శోభన్ బాబు గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిరుపమ్ పరిటాల.
ఇక కార్తీకదీపం సీరియల్ లో నటిస్తూనే మరొకవైపు జీ తెలుగులో ప్రసారమవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం అనే సీరియల్ ని కూడా నిర్మించాడు నిరుపమ్.
ఆ సీరియల్ నిర్మిస్తూ అందులో కూడా ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు.తర్వాత కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రను చంపేసి సరికొత్తగా మొదలుపెట్టడంతో ఆ డాక్టర్ బాబు వంటలక్క లేని పాత్రలను మేము చూడలేము అంటూ అభిమానులు చాలామంది సీరియళ్ చూడడమే ఆపేశారు.
దీంతో ఆ సీరియల్ టిఆర్పి రేటింగ్ భారీగా తగ్గడంతో మళ్ళీ,వంటలక్క డాక్టర్ బాబులను రీఎంట్రీ ఇప్పించారు.

దీంతో ఇప్పుడిప్పుడే ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారిలో పడింది.అయితే కార్తీకదీపం సీరియల్ కి చాలా గ్యాప్ రావడంతో కొన్ని ప్రాజెక్టులను చేస్తున్నట్టు నిరుపమ్ పరిటాల చెప్పుకొచ్చాడు.అందులో భాగంగానే స్టార్ మా లో ప్రసారం కాబోతున్న ఒక సీరియల్ నిర్మించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
కాగా ఇప్పటికే హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ నిర్మించి మంచి సక్సెస్ను అందుకున్న నిరుపమ్ ఇప్పుడు స్టార్ మా లో తన కొత్త సీరియల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించడంతో పాటు ఆ సీరియల్ కు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు.ఇంకా ఇందులో నటి సుష్మ మెయిన్ పాత్రలో కనిపించనుంది.
ప్రముని చూసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆల్ ది బెస్ట్ అంటూ తెలియజేస్తున్నారు.







