టాలీవుడ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం.ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.
ఇందులో అక్కినేని అమల, కమెడియన్ వెన్నెల కిషోర్, అలాగే ప్రియదర్శి కీలకపాత్రలో నటించారు.కాగా ఈ సినిమా ఈనెల 9 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు.కాగా ఎస్ఆర్ ప్రకాష్ బాబు,ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం.
ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సినిమాను చూసిన నాగార్జున, తనయుడు అఖిల్ ఎమోషనల్ అయ్యారు.మరి ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని ఎమోషనల్ గా నాగార్జున ను కంటతడి పెట్టించాయి.
ఈ సందర్భంగా నాగార్జున అంత మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ ని అలాగే అద్భుతంగా నటించిన హీరో శర్వానంద్ ని అభినందించారు.అనంతరం దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ఒకే ఒక జీవితం సినిమా అద్భుతమైన సినిమా అని ఇప్పటివరకు వచ్చిన టైం ట్రావెల్స్ సినిమా లకు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో మనం గతంలోకి వెళ్లి మనం మనల్ని సరిచేసుకునే అవకాశం వస్తే ఏ విధంగా ఉంటుంది అన్న పాయింట్ ని బాగా చూపించారు అని ప్రశంసించారు హను రాఘవపూడి.ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించిన విషయం తెలిసిందే.







