అనేక వాయిదాల తర్వాత నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రులు క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటువంటి తరుణంలో ఈనెల 15వ తారీకు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిపించడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.దాదాపు వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడుల అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇదే క్యాబినెట్ సమావేశంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో.
పెట్టుబడులు పెట్టిన 81 వేల కోట్లకు ఆమోదం క్యాబినెట్ తెలపనుంది.కడప ఇంకా కాకినాడ వంటి చోట్ల కొత్తగా ఏర్పడనున్న పరిశ్రమలపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టనని గతంలో ప్రకటించడం తెలిసిందే.మరి వచ్చేవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ప్రజా ప్రతినిధులు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.







