తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీముఖి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె ఎనర్జీ.
స్టేజ్ పై ఎంతో అల్లరి అల్లరిగా తన మాటలతో చలాకీతనంతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.ఒకవైపు బుల్లితెరపై ప్రసారం అయ్యే పలుషోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ వస్తోంది.
శ్రీముఖి స్టేజి మీదకు వచ్చింది అంటే ఒక తెలియని వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు.
కాగా మొదట పటాస్ షో తో తన కెరిర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు బుల్లితెరపై బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
ఇక శ్రీముఖి అభిమానులు ఆమెను రాములమ్మ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.ఇక బుల్లితెరపై యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో యూత్ ని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కి తగ్గట్టుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి, స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఓ అంటావా మామ అనే పాట కీ అదిరిపోయే స్టెప్పులను వేసింది.అక్కడే ఉన్న పాటిస్పింట్స్ తో కలిసి స్టెప్పులను ఇరగదీసిన శ్రీముఖి ఆ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి ఆ పాటకు స్టెప్పులను ఒక ఊపు ఊపేసింది.కాగా అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ ప్రోమోను బట్టి చూస్తుంటే ఆ ఎపిసోడ్ కి టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఇక శ్రీముఖి డాన్స్ చూసిన అల్లు అరవింద్ బాగుంది సూపర్ గా ఉంది అంటూ గొప్పగా పొగిడారు.శ్రీముఖి డాన్స్ చూసి నా శేఖర్ మాస్టర్ మాట్లాడడానికి కూడా తడబడ్డాడు.







