బిగ్ బాస్ హౌజ్ లో నెగ్గుకురావాలంటే మన పనేదో మనం చూసుకుంటే ఓ మూలన ఉంటే సరిపోదు.ఆటలు ఆడాలి.
గొడవలు పడాలి.టార్గెట్ చేయాలి.
ఫైనల్ గా ఆడియన్స్ మనసులు గెలవాలి.బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు మాత్రమే కాదు బిగ్ బాస్ ఇవ్వని సందర్భాన్ని కూడా తనకు అనువుగా మలచుకోవడమే హౌజ్ మెట్స్ యొక్క టాలెంట్.
ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో అది అందరికి బాగా అర్ధమైనట్టు ఉంది.అందుకే ఈ సీజన్ లో అందరు కంటెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
డే 1 నుంచే వారి ఆటని మొదలు పెట్టారని చెప్పొచ్చు.బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తోనే కాదు తమ కంటెంట్ తో కూడా ఆడియెన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయ్యారు హౌజ్ మెట్స్.
జరిగిన ఒక్కరోజులోనే చిన్న చిన్న గొడవలు.పోట్లాడుకోవడాలు జరిగాయి.అయితే రానున్న రోజుల్లో హౌజ్ మెట్స్ మధ్య గట్టి ఫైట్ జరుగుతుందని మాత్రం అర్ధమవుతుంది.అయితే ఆ ఫైట్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అని చూసేందుకు ఆడియన్స్ సూపర్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.
హౌజ్ లో 21 మంది కంటెస్టంట్స్ ఉండగా ఎవరు ఏ పనిచేస్తున్నారు అన్నది కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుందని చెప్పొచ్చు.







