తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకదీరుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన బాహుబలి, RRR వంటి సినిమాలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాని తెలుగులో ఈయన సమర్పించడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజమౌళి చిత్ర బృందంతో కలిసి క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమానికి అలియా భట్ రణబీర్ కపూర్ మౌని రాయ్ తోపాటు రాజమౌళి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఎప్పటిలాగే వీరందరితో తనదైన స్టైల్ లో సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సుమ రాజమౌళిని పలు ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.
అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా సుమ రాజమౌళిని ప్రశ్నిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరోసారి చిచ్చు పెట్టారని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.

అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఇరువురి అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం నడిచింది.ఈ క్రమంలోనే సుమ రాజమౌళిని ప్రశ్నిస్తూ ఇద్దరి హీరోలలో ఏ హీరో నటన మీకు నచ్చింది అంటూ షాకింగ్ ప్రశ్న వేశారు.సుమ ఇలా ప్రశ్నించడంతో రాజమౌళి మొహం ఒక్కసారిగా మాడిపోయింది.ఇక రాజమౌళి సమాధానం చెప్పేలోగా ప్రోమో కట్ చేశారు.మరి రాజమౌళి ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెబుతారు ఈయన చెప్పే సమాధానంతో మరోసారి అభిమానుల మధ్య గొడవ మొదలవు బోతుందా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.మరి రాజమౌళి ఏమని సమాధానం చెప్పారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.







