వైఎస్సార్ క్లినిక్లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ భర్తీ ప్రకటనపై హైకోర్టులో విచారణ జరిగింది.గతంలో నియామక నోటిఫికేషన్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేసి.
రేపు జరిగే పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ క్రమంలో అర్హులైన ఆయుష్ వైద్యులను కాదని నియామకాలు జరపడం వారి హక్కులను కాలరాయడమేనని న్యాయవాది శ్రావణ్‌కుమార్ అన్నారు.
అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అభ్యర్ధుల సిలబస్ ఇచ్చి పరీక్ష పెడితే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, రేపటి పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని.రూ.65 లక్షలు వ్యయం చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.అయితే, వెంటనే స్టే ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది.తుది వాదనలు వినడం కోసం విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.







