ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న బాధితులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు.హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఆమె కలిశారు.
ఈ నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఆగస్ట్ 24న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు.
వీరిలో నలుగురు మహిళలు మృత్యువాత పడగా.మిగిలిన వారు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై డీహెచ్ ప్రభుత్వానికి రేపు నివేదిక అందించనున్నారు.







