బాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.హిందీ సూపర్ స్టార్స్ అంటూ పేరు దక్కించుకున్న హీరోల సినిమాలు కూడా మినిమం పాతిక నుండి 50 కోట్ల వసూళ్లను రాబట్టేందుకు నాన్న కష్టాలు పడుతున్నాయి.
ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమా కనీసం 20 కోట్ల వసూలను కూడా సాధించలేక పోయింది.అంతటి పెద్ద స్టార్ హీరో కూడా సాధించని వసూళ్లు మన ఒక తెలుగు సినిమా.
అది కూడా లో బడ్జెట్ తో రూపొందిన సినిమా కార్తికేయ 2 ఏకంగా పాతిక కోట్ల రూపాయల వసూలను సాధించింది.ప్రస్తుతం ఇదే అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
ఒకవైపు కార్తికేయ 2 సినిమా వరుసగా నాలుగో వారం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ ఉంది.
పరిస్థితి చూస్తుంటే అక్కడ ఈ సినిమా 30 కోట్ల వస్తువుల వారికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం చేస్తున్నారు.
ఇదే సమయంలో దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ ఠాకూర్ కలిసిన నటించిన మన తెలుగు సినిమా సీతారామం ని హిందీలో విడుదల చేయడం జరిగింది.తెలుగులో విడుదల చేసిన సమయంలోనే హిందీలో కూడా విడుదల చేసి ఉంటే మంచి ఫలితం వచ్చేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు కూడా మంచి వసూళ్ల ను అక్కడ సినిమా రాబడుతుంది అంటూ సమాచారం.
విడుదలైన మొదటి రోజే మంచి టాక్ ని దక్కించుకున్న ఈ సినిమా కు మినిమంగా 10 కోట్ల వసూళ్లు అక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం చేస్తున్నారు.ఇప్పటికే సినిమా దాదాపుగా 85 కోట్ల వరకు వసూలు చేసింది, అక్కడ 10 నుండి 15 కోట్లు వసూలు చేస్తే 100 కోట్ల క్లబ్బులో సీతారామం సినిమా చేరి పోవడం ఖాయమంటూ యూనిట్ సభ్యులు ధీమాతో ఉన్నారు.కార్తికేయ 2 సినిమా జోరు తగ్గడం తో ఈ సినిమా వసూళ్ల సందడి అక్కడ మొదలవుతుందేమో చూడాలి.
ఎలాగో హిందీలో తెరకెక్కిన సినిమా లు విడుదల అవ్వడం లేదు.విడుదలైనా కూడా సక్సెస్ అవడం లేదు.కనుక మన సినిమాలే వాళ్లకు దిక్కు అయ్యాయి.