వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది కడప జిల్లాలోని పులివెందుల.ఎప్పుడు ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ సభ్యులు గెలుస్తూ వస్తున్నారు .ఇక్కడ ఆ స్థాయిలో ఆ కుటుంబానికి మంచిపట్టు ఉంది.ప్రస్తుతం వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ సైతం పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మళ్లీ మళ్లీ ఇదే నియోజకవర్గ నుంచి ఆయన పోటీ చేస్తారు ఇందులో సందేహమే లేదు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో జగన్ అంతగా ప్రచారానికి వెళ్లారు.
ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఎప్పుడు జగన్ లో కనిపిస్తుంది.అయితే అటువంటి గట్టి పట్టున్న నియోజకవర్గం విషయంలో ఇప్పుడు జగన్ సైతం కాస్త ఆందోళన గానే ఉన్నారట .
గతంలో ఉన్న మాదిరిగా పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం, తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి టిడిపి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఫోకస్ పెట్టడంతో, జగన్ సైతం ఇప్పుడు పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీనికి తోడు కుటుంబంలోనూ వివాదాలు పెరిగాయి.
ముఖ్యంగా జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం తరువాత బంధువులలోను చీలికలు వచ్చాయి.అంతేకాదు జగన్ షర్మిల కు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది .ఈ క్రమంలో జగన్ ఈ నియోజకవర్గం పై ఫోకస్ పెంచినట్లు సమాచారం.ఇప్పటి వరకు ఈ నియోజక వర్గం తరపున కొంతమంది నాయకులు వ్యవహారాలు చూసుకునేవారు.
ఇదే విధంగా చక్రాయపేట మండలం లో కొండారెడ్డి వ్యవహారాలు చూసుకునేవారు.
అయితే ఇప్పుడు కొండారెడ్డి దూరమయ్యారు.దీంతో నేరుగా జగన్ రంగంలోకి దిగిపోయారు.తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించేందుకు నిన్న పులివెందుల వచ్చిన జగన్ అక్కడ మండలాల వారిగా వైసిపి నాయకులతో సమావేశం అయ్యారట.
పార్టీ పరంగాను, వ్యక్తిగతంగాను ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆందోళన చెందవద్దని, తాను అన్ని చూసుకుంటానని భరోసా ఇచ్చారట.గతంలో ఎప్పుడూ లేనివిధంగా మండల, గ్రామ స్థాయి నాయకులతో జగన్ నేరుగా బేటి కావడంతో పార్టీ నాయకులలోను సంతృప్తి కలిగించిందట.
అయితే ఇటీవల వైసిపి నాయకులలోని చీలిక రావడం, కొంతమంది నాయకుల పెత్తనం ఎక్కువ కావడం, పులివెందులలో పరిస్థితులు కాస్త గందరగోళంగా మారడం , తదితర వ్యవహారాలతో జగన్ ముందుగానే అలర్ట్ అయ్యి, రానున్న రోజుల్లో తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పులివెందుల లో రాజకీయ ప్రత్యర్థులకు పట్టు దొరకకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.