ఆస్ట్రేలియాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఎన్నో ఆశలతో భారత్ నుంచీ శిక్షణ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన పంజాబ్ కి చెందిన యువ గాయకుడు నిర్వేయర్ సింగ్ ఊహించని విధంగా అక్కడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
తన పాటలతో ఎంతో కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న నిర్వేయర్ సింగ్ మృతి చెందటంతో ఆయన అభిమానులు, కుటుంభ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.పూర్తి వివరాలలోకి వెళ్తే పంజాబ్ కి చెందిన నిర్వేయర్ సింగ్ కి పాటలంటే ఎంతో ప్రాణం.
తన ప్రతిభకు మరింత మెరుగు పెట్టేందుకు గాను అతడు 9 ఏళ్ళ క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు.ఇక్కడ శిక్షణ తీసుకుంటూనే ఎన్నో ఆల్బమ్స్ చేశాడు.
క్రమ క్రమంగా నిర్వేయర్ పేరు మారుమొగిపోయింది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నిర్వేయర్ సింగ్ ఎప్పటి లానే తాను సింగర్ గా పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లేందుకు తన కారులో బయలుదేరాడు.
మెల్బోర్న్ లోని బుల్లా డిగ్గర్స్ అనే ప్రాంతంలో కారు చేరుకున్న సమయంలో.
వెనుక నుంచీ అత్యంత వేగంగా వచ్చిన మరో కారు డీ కొట్టడంతో నిర్వేయర్ సింగ్ కారు పల్టీలు కొట్టింది.
ఈ ఘటనలో అతడు అక్కడి కక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్ష్యులు పోలీసులకు తెలిపారు.పంజాబీ సింగర్ గా ర్యాపర్ గా ఆస్ట్రేలియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిర్వేయర్ సింగ్ మృతి పై స్థానిక పంజాబీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
అభిమానులు, కుటుంభ సభ్యులు కన్నీళ్ళ పర్యంతమయ్యారు.ఇదిలాఉంటే ఈ ఘటనకు కారణమైన కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతీ యువకులు కూడా తీవ్ర గాయాల పాలవడంతో వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టుగా ప్రకటించారు
.






