టీవీ యాంకర్ ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.ప్రత్యక్ష ప్రసారాల కోసం ఎంతో సన్నద్ధతతో ఉండాలి.
విషయాలపై అవగాహన ఉండాలి.సందర్భానుగుణంగా స్పందించే తత్వం ఉండాలి.
అయితే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ వారికి అందం కూడా ఉండాలి.వారి ముఖం ఏ మాత్రం అందం కోల్పోయినా వారి స్థానంలో కొన్ని ఛానళ్లు కొత్త వారిని తీసుకుంటాయి.
ఇలాగే లైవ్ న్యూస్ చదువుతుండగా ఓ టీవీ యాంకర్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది.ఎంతో సీరియస్‌గా వరదల గురించి వార్తలో చెబుతుంటే ఓ ఈగ ఆమె గొంతులో దూరింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి.
వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతున్నారు.
అక్కడి దయనీయ పరిస్థితులను ప్రపంచ వ్యాప్తంగా వార్తా ఛానెళ్లన్నీ కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.ఈ తరుణంలో కెనడాలోని గ్లోబల్ న్యూస్ అనే న్యూస్ ఛానల్ కూడా పాక్‌లోని వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులను కవర్ చేస్తోంది.
ఫరా నాసర్ అనే మహిళా యాంకర్ ఆ వార్తలను లైవ్‌లో చదివి వినిపిస్తోంది.ఈ క్రమంలో అకస్మాత్తుగా ఓ ఈగ ఆమెకు ఆటంకం కలిగించింది.
గుయ్ గుయ్ మంటూ వచ్చి ఆమె గొంతులో దూరిపోయింది.ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది.అంతలోనే తేరుకుని వార్తల ప్రసారంలో మునిగి పోయింది.అయితే తనకు ఎదురైన ఘటనను ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేసింది.వార్తలు చదువుతుండగా తన గొంతులో ఈగ దూరిందని ఆమె చెప్పింది.దానికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రస్తుత రోజుల్లో నవ్వడం అనే విషయం అందరికీ అవసరమనీ, అందుకే ఈ వీడియోను పోస్ట్ చేశానని ఆమె పేర్కొంది.అనుకోని పరిస్థితుల్లో తాను ఈగను మింగేశానని తెలిపింది.