ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డీహెచ్ విచారణ ముగిసింది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విఫలంపై డీహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని కమిటీ విచారించింది.
ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 11 మందిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఈ ఘటనపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటివరకు 12 లక్షల ఆపరేషన్లు నిర్వహించామన్నారు.ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్స్ చేసిన డాక్టరే .చేవెళ్లలో 60 మందికి, సూర్యాపేటలో 100 మందికి ఆపరేషన్లు చేశారని డీహెచ్ స్పష్టం చేశారు.







