టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది.ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన జల్సా సినిమాని ఒక రోజు ముందుగానే 4K లో విడుదల చేశారు.
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులను సందడి చేసింది.అయితే కొన్ని ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున రెచ్చిపోయారు.
ఈ క్రమంలోనే కర్నూలులో అభిమానులు రెచ్చిపోతూ థియేటర్ పై దాడి చేయడంతో థియేటర్ పాక్షికంగా ధ్వంసం అయింది.
కర్నూలులోని శ్రీరామ టాకీస్ లో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా విడుదల అయింది.
అయితే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో థియేటర్లో సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.అయితే సహనం నశించిన అభిమానులు ఒక్కసారిగా థియేటర్ బయటకు వచ్చి రాళ్లతో థియేటర్ అద్దాలపై దాడి చేశారు.
ఈ దాడిలో భాగంగా థియేటర్ పాక్షికంగా ధ్వంసం అయింది.

ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ పై దాడి చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు అభిమానులను అరెస్టు చేయడమే కాకుండా కొన్ని ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేస్తూ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఇక థియేటర్ ప్రాంతంలో ఎలాంటి గొడవలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహించారు.అయితే హీరోలపై అభిమానం ఉండాలి కానీ మరి శృతి మించిన అభిమానం ఉండకూడదని ఈ ఘటనపై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.







