ఆధునిక మానవుడి జీవనం సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది.సోషల్ మీడియా లేకపోతే తమకు కాలక్షేపం లేదు.
రోజు గడవదు అన్నట్టు గా పరిస్థితి తయారయింది.అయితే ఈ సోషల్ మీడియా ద్వారా జనాలకు మంచి ఎంత జరుగుతుందో .చెడు కూడా అంతే జరుగుతుంది.ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ను వేదికగా చేసుకుని కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుండడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి కారణం అవుతోంది.
ఈ క్రమంలోని సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా పోలీసులు కొత్త చట్టాలతో రంగంలోకి దిగుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు పెట్టేవారు ఇక పై ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది.
ఇక విషయంలోకి వస్తే.తెలంగాణలో ఈ మధ్యకాలంలో కొన్ని మతాలను, వర్గాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు, మరికొంతమంది రాజకీయ నాయకులు పోస్టింగ్స్ పెడుతూ, ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉండడంతో తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు.
సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో అలజడులు, గొడవలు , రెచ్చగొట్టే విధంగా ఉన్న ప్రసంగాలను పెడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, దీనికోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు.తాజాగా రెచ్చగొట్టే విధంగా మతతత్వ విద్వేషాలు పెంచే విధంగా పోస్టింగ్స్ పెట్టిన గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పైన పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపారు. ఇదేవిధంగా మరి కొంతమంది నాయకులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ తో హైదరాబాదులో అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది.శాంతి భద్రతల సమస్య ఏర్పడింది.రాజాసింగ్ పోస్ట్ పై ఓ వర్గం వారు మరింతగా రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం, భారీ జనాలతో కమిషనర్ కార్యాలయం ముందు , రాజాసింగ్ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించడం వంటి వ్యవహారాలపై ఇద్దరు నేతలపై పిడి యాక్ట్ నమోదు చేశారు.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ‘ స్మాష్ ‘ అనే సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని, ఇది సోషల్ మీడియాలో ప్రతి పోస్ట్ పైన నిఘా ఉంచుతుందని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.అంతే కాదు తెలంగాణలో 600 మంది డ్రగ్స్ వాడుతున్నారని సిపి ఆనంద్ తెలిపారు.
వీరంతా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు.వీరిలో ఎక్కువ మంది బీటెక్ విద్యార్థులు, సాప్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారని దీనిపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సీవీ ఆనంద్ తెలిపారు.







