ఎన్టీఆర్ ను కలవడం ఆ రాజకీయ పార్టీకి ప్లస్ అయిందా.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటే మాత్రమే సక్సెస్ సాధించి కెరీర్ ను కొనసాగించడం సాధ్యమవుతుందనే సంగతి తెలిసిందే.అటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఇటు సినీ బ్యాగ్రౌండ్ ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ తో సినిమాలలో ఇప్పటికే సక్సెస్ సాధించారు.

 Interesting Facts About Bjp Met Junior Ntr Details Here Goes Viral , Bjp , Am-TeluguStop.com

కళ్లు చెదిరే రికార్డులను తారక్ సొంతం చేసుకున్నారు.అయితే కొన్నిరోజుల క్రితం అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారనే సంగతి తెలిసిందే.

అమిత్ షాను తారక్ కలవడం అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు పొలిటికల్ వర్గాలో చర్చనీయంశమైంది.అయితే జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం బీజేపీకి పొలిటికల్ గా ప్లస్ అయిందని తెలుస్తోంది.

మునుగోడు బై ఎలక్షన్ లో విజయం కోసమే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.నటులను కలవడం ద్వారా ఆ నటుల ఫ్యాన్స్ మద్దతు పొందాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

Telugu Amit Shah, Ntr, Munu Godu, Telangana Bjp, Telengana, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ పేరు మారుమ్రోగుతోంది.ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో తొలి స్థానంలో ఉందని జూనియర్ ఎన్టీఆర్ ను కలవడమే ఇందుకు కారణమని బోగట్టా.ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి చాలా ప్లస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కొనసాగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ప్రముఖ నటులను కలుస్తూ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రోజురోజుకు బీజేపీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఆ పార్టీ నేతల సంతోషానికి కారణమవుతోంది.రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పార్టీ నేతలు నిర్ణయాలను తీసుకుంటున్నారు.మునుగోడులో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube