ఏపీలో పది వేల మంది టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.టీచర్లను డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్ఎంలుగా ప్రమోషన్లు కల్పించారు.
ఈ క్రమంలో వారి పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో, 36 డిప్యూటీ డీఈవో పోస్టులు మంజూరు చేశారు.అదేవిధంగా 2,300 మంది టీచర్లకు సబ్జెక్టు మార్పుకు అవకాశం ఉంటుంది.
అయితే ఈ సెప్టెంబర్ లో పదోన్నతులు కల్పించిన తరువాత టీచర్ల సాధారణ బదిలీలు ఉంటాయని అధికారులు తెలిపారు.







