తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలను చేస్తుంది.ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా టాలీవుడ్ లో బిజీగా మారుతానని భావించింది.
కానీ ఈ అమ్మడికి వకీల్ సాబ్ సినిమా వల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు.ఆ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈమెకు ఆఫర్లు ఏమీ రావడం లేదు అంటున్నారు.
చిన్నా చితకా సినిమాల్లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నా ఈఅమ్మడికి టాలీవుడ్ నుండి పెద్దగా ఆఫర్లు రావడం లేదంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.ఈ సమయం లోనే ఈ అమ్మడు తన అందం పెంచుకునే ఉద్దేశం తో పెదాలకు ఆపరేషన్ చేయించుకుందంటూ పుకార్లు షికార్లు చేశాయి.
అందం పెంచుకున్నా కూడా ఈ అమ్మాయిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అనన్య నాగళ్ళ సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో విఫలం అవుతుంది.
ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో అవకాశం వచ్చినా అవి పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకు రాలేకపోయాయి.ఇక చిన్న సినిమాల్లో నటించి హీరోయిన్ గా పేరు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్ లను షేర్ చేయడం ద్వారా అభిమానులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది అంతే తప్ప ఈమెకు పెద్దగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు.
మొత్తానికి ఈ అమ్మడు ఏం చేసినా కూడా సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో సోషల్ మీడియాకు పరిమితం అవ్వబోతుందా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో ఈమె కేవలం సినిమాలు అని మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చినా చేయడం మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.