ప్రమాదం ఎక్కడి నుండి పొంచి ఉంటుందో తెలియదు.ఏ క్షణం ఏం జరుగుతుందో ఏమాత్రం ఊహించలేము.
అందుకే రోడ్డుపై వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంటారు.చిన్న ఏమరపాటుకు కూడా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
స్వల్ప నిర్లక్ష్యం కూడా భారీ విపత్తుకు దారి తీయవచ్చు.మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.ఒక్కోసారి మనం అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నా.
ఎదుటి వారి చిన్న పొరపాటు మన ప్రాణాల మీదకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.ఇలాంటివి ఏమాత్రం ఊహించలేము.కానీ మనవంతు జాగ్రత్త మాత్రం పాటించాల్సిందేనని అంటారు.
50వ జాతీయ నంబరు రహదారిపై జరిగిన ప్రమాదానికి చెందిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అతి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు..టోల్ ప్లాజాను ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
బస్సును అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బస్సులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.బస్సు వేగంగా వచ్చి టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో బస్సు లోపల ఉన్న వారికి పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
బస్సు ఢీకొట్టిన వేగానికి టోల్ ప్లాజా ధ్వంసం అయింది.లోపల ఉన్న టోల్ గేట్ సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుండి పక్కకు తప్పుకోవడంతో.
అతడు ప్రాణాల నుండి బయట పడ్డాడు.