ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత రమేష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పరుచూరి బ్రదర్స్ అప్పట్లో 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆయన తెలిపారు.
ఇ.వి.వి.సత్యనారాయణ గారు లక్ష రూపాయల వరకు రైటర్లకు ఇప్పించారని ఆయన చెప్పుకొచ్చారు.లాంగ్ ట్రావెల్ కావాలని మేము కోరుకునే వాళ్లమని ఆయన తెలిపారు.పరుచూరి మురళి గారి దగ్గర పెదబాబు, ఆంధ్రుడు, రెచ్చిపో సినిమాలకు పని చేశానని ఆయన కామెంట్లు చేశారు.
ఓం పెట్టిన రోజు నుంచి సినిమా సెన్సార్ అయ్యే వరకు మేము సినిమా కోసం పని చేసేవాళ్లమని ఆయన తెలిపారు.ఇండస్ట్రీలో శ్రమ దోపిడి అనేది ఉంటుందని రమేష్ రెడ్డి వెల్లడించారు.
శ్రమ దోపిడి అని ఫీలైతే సినిమా ఇండస్ట్రీలో పని చేయలేమని ఆయన అన్నారు.కొత్త డైరెక్టర్లతో నేను ఎక్కువగా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ కాదని మార్చుకునే డైలాగ్స్ ను మేము రాయమని ఆయన తెలిపారు.
ఇప్పుడు డైలాగ్ రైటర్లకు పని తగ్గిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దర్శకులే డైలాగ్ రైటర్లు అయ్యారని ఆయన తెలిపారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా షూట్ సమయంలో గమ్మత్తైన ఘటన జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
పొల్లాచ్చి దగ్గర షూట్ జరుగుతోందని కళ్యాణ్ గారు క్యారవాన్ లోనే ఉండిపోయారని ఏదో ఇష్యూ వల్ల ఆయన డల్లుగా ఉన్నారని రమేష్ రెడ్డి అన్నారు.

హరీష్ శంకర్ కు ఆ విషయం తెలిసిందని రమేష్ రెడ్డి తెలిపారు.బండ్ల గణేష్ ఆ సమయంలో టెన్షన్ పడిపోతున్నారని రమేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఆ సమయంలో హరీష్ శంకర్ “నాక్కొంచెం తిక్కుంది.
దానికో లెక్కుంది” డైలాగ్ ను పవన్ ను కలిసి చెప్పారని పవన్ కు ఆ డైలాగ్ నచ్చిందని ఆయన వెల్లడించారు.ఆ డైలాగ్ విని డల్లుగా ఉన్న పవన్ యాక్టివ్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.







