అసలే వర్షాకాలం. ఈ సీజన్‌లో ఎక్కడ్లేని వ్యాధులు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
జలుబు, దగ్గు, ఫ్లూ, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఇలా ఎన్నో వ్యాధులు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.వీటికి తోడు వర్షాల కారణంగా బద్ధకం పెరిగిపోయి చాలా మంది వ్యాయామాలపై కూడా దృష్టి సారించలేకపోతుంటారు.
ఈ క్రమంలోనే బరువు పెరిగిపోతుంటారు.దాంతో అటు హెల్త్, ఇటు ఫిట్‌నెస్.
రెండు దెబ్బ తింటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను మీ డైట్‌లో చేర్చుకుంటే ప్రస్తుత వర్షాకాలంలో హెల్తీగానే కాదు ఫిట్‌గా కూడా ఉండొచ్చు.
మరి లేటెందుకు ఆ జ్యూస్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను ఆవిరిపై పది నిమిషాల పాటు ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి.ఈలోపు ఒక టమాటో మరియు ఒక యాపిల్‌ను కూడా తీసుకుని వాటర్‌లో కడిగి ముక్కలుగా కట్ చేసి పట్టుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, టమాటో ముక్కలు, ఆవిరిపై ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు,
![Telugu Apple, Carrot, Carrotapple, Fitness, Tips, Latest, Stay Healthy, Tomato-T Telugu Apple, Carrot, Carrotapple, Fitness, Tips, Latest, Stay Healthy, Tomato-T](https://telugustop.com/wp-content/uploads/2022/08/If-you-want-to-stay-healthy-and-fit-during-monsoons-definitely-include-it-in-your-diet-detailss.jpg)
మూడు లేదా నాలుగు పుదీనా ఆకులు, గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే.టేస్టీ యాపిల్ క్యారెట్ టమాటో జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్‌లో రుచికి సరిపడా తేనెను కలిపి తాగేయడమే.
రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో ఈ జ్యూస్‌ను తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.
వర్షాకాలంలో వేధించే వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.బాడీలో పేరుకుపోయిన కొవ్వు కరిగి వెయిట్ లాస్ అవుతారు.కంటి చూపు రెట్టింపు అవుతుంది.క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.