మన అందరికీ బాగా పరిచయం ఉన్న రోబో చిట్టి రోబో.చాలా మంది రోబో అనగానే చిట్టీరోబో అంటూ గుర్తు చేసుకుంటారు.
ఇక సినిమాలో చిట్టి రోబో చేసిన ఎన్నో పనులు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.అది చేసే ప్రతి పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.కానీ ఈ రోబో మాత్రం నాతో మూములుగా ఉండదంటూ ముందే వార్నింగ్ ఇస్తుంది.
13 ఏళ్ల పిలగాడు అద్భుతంగా ఆవిష్కరించిన రోబో ఇప్పుడు తన చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది.ఎప్పుడచ్చామన్నది ముఖ్యం కాదు.ఎంత మందితో శభాష్ అనిపించుకుంటున్నామో అదే ముఖ్యం అని అనుకుంటుందో ఏమో ఆ రోబో తన చిలిపి అల్లరితో అందరినీ తన వైపు లాక్కుంటుంది.
దానిలో అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా.? ఏ రోబో అయినా సరే ఆహార పదార్థలు తీసుకొచ్చి ఇస్తుంది.లేదంటే చిట్టిపొట్టి మాటలతో మాట్లాడుతుంటుంది.కానీ ఈరోబో మాట్లడాటమే కాదు.ఏవరైనా తిడితే ఊరుకోదంట.వారు మళ్లీ సారీ చెప్పేదాక తన తడాక ఏంటో చూపిస్తానంటోంది.
అంతే కాదండోయ్.ఈ రోబోకు జాలీ, ప్రేమ కూడ ఎక్కువే.
, ఎవరైనా విచారంగా కూర్చొంటె వారిని పలకరించి మరీ తమ బాధ తెలుసుకుంటుందంట.
అవునా.
ఇలాంటి రోబోకు ఎవరు ప్రాణం పోశారు అనుకుంటున్నారా.? ప్రతీక్ అనే బాలుడుకి తన చిన్నప్పటి నుంచి వస్తువులు తయారు చేయడం, ఆవిష్కరణలపై ఎక్కువ ఆసక్తి, దాంతో ఈ చిట్టి రోబోకు ప్రాణం పోసి ప్రశంసలు అందుకుంటున్నాడు.అంతే కాదండోయ్ ఈ చిచ్చర పిడుగుకు గోల్డ్ మెడల్స్ కూడా ఎక్కువే వచ్చాయంట.







