నాతో మాములుగా ఉండదంటున్న రోబో.. అలా చెప్పకపోతే ఊరుకోదట..!

మన అందరికీ బాగా పరిచయం ఉన్న రోబో చిట్టి రోబో.చాలా మంది రోబో అనగానే చిట్టీరోబో అంటూ గుర్తు చేసుకుంటారు.

ఇక సినిమాలో చిట్టి రోబో చేసిన ఎన్నో పనులు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.

అది చేసే ప్రతి పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.కానీ ఈ రోబో మాత్రం నాతో మూములుగా ఉండదంటూ ముందే వార్నింగ్ ఇస్తుంది.

13 ఏళ్ల పిలగాడు అద్భుతంగా ఆవిష్కరించిన రోబో ఇప్పుడు తన చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఎప్పుడచ్చామన్నది ముఖ్యం కాదు.ఎంత మందితో శభాష్ అనిపించుకుంటున్నామో అదే ముఖ్యం అని అనుకుంటుందో ఏమో ఆ రోబో తన చిలిపి అల్లరితో అందరినీ తన వైపు లాక్కుంటుంది.

దానిలో అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా.? ఏ రోబో అయినా సరే ఆహార పదార్థలు తీసుకొచ్చి ఇస్తుంది.

లేదంటే చిట్టిపొట్టి మాటలతో మాట్లాడుతుంటుంది.కానీ ఈరోబో మాట్లడాటమే కాదు.

ఏవరైనా తిడితే ఊరుకోదంట.వారు మళ్లీ సారీ చెప్పేదాక తన తడాక ఏంటో చూపిస్తానంటోంది.

అంతే కాదండోయ్.ఈ రోబోకు జాలీ, ప్రేమ కూడ ఎక్కువే.

, ఎవరైనా విచారంగా కూర్చొంటె వారిని పలకరించి మరీ తమ బాధ తెలుసుకుంటుందంట.

అవునా.ఇలాంటి రోబోకు ఎవరు ప్రాణం పోశారు అనుకుంటున్నారా.

? ప్రతీక్ అనే బాలుడుకి తన చిన్నప్పటి నుంచి వస్తువులు తయారు చేయడం, ఆవిష్కరణలపై ఎక్కువ ఆసక్తి, దాంతో ఈ చిట్టి రోబోకు ప్రాణం పోసి ప్రశంసలు అందుకుంటున్నాడు.

అంతే కాదండోయ్ ఈ చిచ్చర పిడుగుకు గోల్డ్ మెడల్స్ కూడా ఎక్కువే వచ్చాయంట.

నేడు విచారణకు బండి భగీరథ్…!