ఘనంగా సూర్య విక్రమాదిత్య జన్మదిన వేడుకలు

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్షనేత మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య జన్మదిన వేడుకలను ఖమ్మం ప్రజాభవన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.చింతకాని యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో సూర్య విక్రమాదిత్య పుట్టినరోజును పురస్కరించుకొని తల సేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి రక్తదాన శిబిరం నిర్వహించారు.

 Grand Birthday Celebrations Of Surya Vikramaditya , Surya Vikramaditya, Mallu B-TeluguStop.com

ఈ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పట్టణ అధ్యక్షులు జావిద్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం లు ప్రారంభించారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన యువకులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులను మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు అభినందించారు.

సూర్య విక్రమాదిత్య నిండు నూరేళ్లు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ నాయకులు బాలాజీ నాయక్, వడ్డే నారాయణరావు రక్తదానం చేసిన వారిలో టి శ్రీనివాసరావు, పి.బ్రహ్మచారి, ఎస్.బ్రహ్మయ్య, ఎన్.సుదీర్, జి.బుచ్చి రామయ్య, రవి, గౌతమ్, వీరభద్ర రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube