మట్టి గణపతులను ప్రతిష్టించి, నవరాత్రి ఉత్సవాలను జరిపి పర్యావరణ రక్షించుకుందామని, ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ వద్దు,మట్టి గణపతులే ముద్దు అనే నినాదంతో మట్టి గణపతులతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ యువతకు పిలుపునిచ్చారు.స్థానిక సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షుడు జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో
షేక్ బషీరుద్దీన్
మాట్లాడుతూ వినాయక ఉత్సవ కమిటీలు, యువతీ యువకులు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆయన కోరారు.
దీనివల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంటుందని అది అందరికీ మంచిదని ఆయన సూచించారు.
ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ తో తయారుచేసిన గణపతి బొమ్మలు ఉపయోగించడం వలన పర్యావరణం దెబ్బతింటుందని, నీళ్లు కలుషితం అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
డివైఎఫ్ఐ, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ఉచితంగా పంచుకున్నట్టు ఆయన తెలియజేశారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నరేష్, గుమ్మ ముత్తారావు, శీలం వీరబాబు, సహాయ కార్యదర్శులు చింతల రమేష్, కూరపాటి శ్రీను నాయకులు కనపర్తి గిరి, కొంగర నవీన్,తదితరులు పాల్గొన్నారు.