పది సినిమాలు కంటిన్యూగా ప్లాప్.. అయిన సినిమా అవకాశాలు.. స్టార్ కిడ్ కు ఈ మాత్రం వైభోగం ఉండదా ఏంటీ?

సినీ ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో వచ్చిన వారి కంటే వారసత్వాలే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.తాము స్టార్ హోదాలో ఉండగానే తమ వారసులను ఇండస్ట్రీలో పరిచయం చేస్తుంటారు కొందరు స్టార్ నటీనటులు.

 Hero Adi Saikumar Movie Offers After 10 Continuous Flops Details, Adi Saikumar F-TeluguStop.com

అలా ఇప్పటికి చాలామంది అడుగు పెట్టారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు వారసత్వాలే ఉన్నారు.

ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.సొంత టాలెంట్ తో వచ్చిన హీరోలకి, వారసత్వంగా అడుగుపెట్టిన హీరోలకి ఇండస్ట్రీలో చూసే విధానంలో కాస్త మార్పులు ఉంటాయి.ఎందుకంటే వారసత్వంగా వచ్చిన హీరోల సినిమాలు ఫ్లాప్ సరే వారికి మళ్లీ అవకాశాలు వెంట పడుతూనే ఉంటాయి.

అదే సొంత టాలెంట్ తో అడుగుపెట్టిన హీరోలకు.

ఒక ఫ్లాప్ ఎదురైతే చాలు కవర్ కెరీర్ ముగిసినట్లే.ఏదో కొన్ని సందర్భాలలో వాళ్లకు తప్పదు అన్నట్లుగా అవకాశాలు ఇస్తుంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కుమారుడు హీరోగా ఒక గుర్తింపు సొంతం చేసుకున్న కూడా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు.

Telugu Burrakatha, Chuthalalabbai, Galipatam, Goldfish, Jodi, Nuve, Nitin, Prema

అయినా కూడా దర్శక నిర్మాతలు ఇతడికి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్. ప్రముఖ తెలుగు నటుడు సాయికుమార్ కుమారుడు ఆది.మొదటిసారిగా ప్రేమకావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆది ఈ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత లవ్ లీ, సుకుమారుడు వంటి సినిమాల్లో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా విజయం సొంతం చేసుకోలేకపోయాడు.అయినా కూడా ఆయనకు ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు ఇచ్చారు దర్శక నిర్మాతలు.ఏకంగా 10 సినిమాలలో వరుసగా ఫ్లాప్ లు సొంతం చేసుకున్నాడు ఆది.

Telugu Burrakatha, Chuthalalabbai, Galipatam, Goldfish, Jodi, Nuve, Nitin, Prema

ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే.ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్, చుట్టాలబ్బాయి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి, గోల్డ్ ఫిష్, శశి, తీస్మార్ ఖాన్.ఇక ఈ సినిమాలన్నీ ఈయనను నిరాశపరిచాయి.

అయినా కూడా అది ఈ విషయం గురించి ఎటువంటి చింత లేకుండా మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

అదే నితిన్, విజయ్ దేవరకొండలు కూడా వరుసగా 2,3 సినిమాలలో ఫ్లాప్ అందుకున్న కూడా వీరికి అవకాశాలు ఇవ్వటానికి భయపడుతున్నారు దర్శకులు.

అంటే అక్కడ పది సినిమాలు నిరాశపరిచినా కూడా ఆది స్టార్ హీరో కొడుకు కాబట్టి ఆయనకు అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు నెటిజన్లు.ఇక ప్రస్తుతం సొంత టాలెంట్ తో వచ్చిన హీరోలకు కెరీర్ ముందుకు సాగాలి అంటే వారికి ఎవరో ఒక దర్శకుడు మంచి అవకాశం ఇవ్వాల్సిందే.

లేదంటే వారి పరిస్థితి మరోలా మారిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube