పీడీయాక్ట్ రద్దు కోసం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కుటుంబం న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో పీడీ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఆరు నెలల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు పీడీ యాక్ట్ ప్రయోగించడం ఏంటని రాజాసింగ్ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.అయితే పీడీయాక్ట్ తొలగించాలంటే అడ్వైజర్ కమిటీనే నిర్ణయం తీసుకోవాలి.
పీడీయాక్ట్ జీవోను హైకోర్టులో సవాల్ చేయవచ్చన్న నేపథ్యంలో రాజాసింగ్ కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.ఈ నేపథ్యంలో అడ్వైజరీ కమిటీ తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







