బుల్లితెరపై మహేష్ బాబు సితార.. ఆ డ్యాన్స్ షోలో సందడే సందడి!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు ప్రస్తుతం వరద సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Mahesh Babu Attend As Guest With Sitara In A Dance Show, Mahesh Babu, Sitara, Da-TeluguStop.com

రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి మహేష్ బాబు.కాగా సూపర్ స్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులలో చరగని ముద్రను వేసుకున్నాడు.

సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మహేష్ బాబు.కాగా ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతోపేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు మహేష్ బాబు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీ లైఫ్ నీ కూడా ఎంజాయ్ చేస్తూ రెండింటిని మెయింటైన్ చేస్తున్నాడు.

మహేష్ బాబుకు తన కూతురు సితార కొడుకు గౌతమ్ అంటే ఎంత ఇష్టం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే పలు సార్లు బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో పాల్గొన్న మహేష్ బాబు తాజాగా కూడా ఒక షోలో పాల్గొన్నాడు.

కాగా ఈసారి మాత్రం సింగిల్ గా రాకుండా తనతో పాటు తన ముద్దుల కుమార్తె సితారను కూడా తీసుకొని వచ్చాడు మహేష్ బాబు.

కాగా ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరించిన అన్​స్టాపబుల్​ షోలో మహేశ్​బాబు పాల్గొన్న మహేష్ తాజాగా మళ్లీ ఓ టీవీ షోలో మెరిశారు మహేశ్​ బాబు.ఒక ఛానెల్​నిర్వహిస్తోన్న డ్యాన్స్ షోకి మహేశ్​బాబు, కూతురు సితార కూడా హాజరయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఆ వీడియోలో మహేష్ బాబు తన కూతురు సితారతో కలసి సెట్స్ పైకి వెళ్తున్నాడు.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఆ కొంచెం సేపు ఉన్న ప్రోమో ని చూసిన అభిమానులు అందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.కాగా ఆ వీడియోలో మహేశ్​బాబు స్టైలిష్​ అవుట్ ఫిట్​ధరించగా, సితారా కూడా గ్లిట్టర్​ ఫ్రాక్​ వేసుకుని ఆకట్టుకునేలా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube