ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు నెక్స్ట్ సినిమా అప్డేట్ ను త్రివిక్రమ్ అందించి వారిని ఖుషీ చేసాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందులోను త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.
ఈ సినిమాలో మరొక మాజీ హీరో కూడా భాగం కానున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మరొక మాజీ హీరోను తీసుకో బోతున్నారని టాక్ ఎప్పటి నుండో వినిపిస్తుంది.
అయితే ఇప్పటికే ఈ సినిమాలో ఈ పాత్ర కోసం చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి.
ఇక ఇప్పుడు మరొక మాజీ హీరో పేరు వినిపిస్తుంది.

గతంలో లవర్ బాయ్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు తరుణ్.తరుణ్ తోనే త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా చేసి దర్శకుడిగా తన కెరీర్ స్టార్ట్ చేసాడు.ఇప్పుడు అదే హీరోను కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ తీసుకున్నాడని టాక్ బయటకు వస్తుంది.మరి ఇదే నిజం అయితే తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.
ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేయనున్నారట.
చూడాలి ఈ సినిమాతో మహేష్, త్రివిక్రమ్ ఎలాంటి హిట్ కొడతారో.







