తెలంగాణలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను, హాస్టళ్లను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.విద్యార్థులకు ఉన్న వసతులు కన్నా.
జైళ్లలో ఖైదీలకు ఇచ్చే వసతులే బెటర్ గా ఉన్నాయని విమర్శించారు.ఏ గురుకులంలో చూసినా నిర్లక్ష్యమే తాండవం చేస్తోందని మండిపడ్డారు.
అనంతరం, ఇటీవల నారాయణ్ ఖేడ్, జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ పాఠశాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై విజయశాంతి స్పందించారు.ఫుడ్ పాయిజన్ అయి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యమైన భోజనం అందిస్తామని చెబుతున్న మాటలు చేతల్లో అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు.







