ఢిల్లీ కుంభకోణంతో జగన్, భారతి, విజయసాయిరెడ్డికి సంబంధాలు..

ఢిల్లీ కుంభకోణంతో జగన్, భారతి, విజయసాయిరెడ్డికి సంబంధాలు.దీని నుండి బయటపడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారు విజయసాయిరెడ్డి లిక్కర్ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారు.

 Jagan, Bharti And Vijayasai Reddy's Connections With The Delhi Scam , Jagan, Bha-TeluguStop.com

ఢిల్లీ కుంభకోణం విచారణను సీబీఐ ఏపీకి విస్తరించాలి.ఏపీ కల్తీ మద్యంపైనా విచారణ చేయాలి ఆనం వెంకట రమణారెడ్డి.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణ కేసుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డికి సంబంధాలున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

‘‘ఏపీ కల్తీ మద్యం తాడేపల్లి రాజప్రాసాదం నుండి దేశరాజధాని ఢిల్లీ వరకు ఏరులై పారుతోంది.ఢిల్లీ మద్యం కేసు వివరాల కోసం సీబీఐ అధికారులు ఢిల్లీలో తీగ లాగితే.

తాడేపల్లి రాజప్రాసాదం పునాదులు కదులుతున్నాయి.దీనికి ఢిల్లీలో జరిగిన లిక్కర్ భారీ స్కాం ఘటనపై సీబీఐ పెట్టిన కేసులు, నిందితుల వివరాలే సాక్ష్యాధారాలు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఏ5 గా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీని పేర్కొంది.ఈ కేసులో ఏ8 గా ఉన్న పెనాక శరత్ చంద్రారెడ్డి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు డైరెక్టర్ గా ఉన్నాడు.

శరత్ చంద్రారెడ్డి స్వయాన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి అన్నయ్య.అరబిందో గ్రూపులోని 17 కంపెనీలకు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, 12కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు.

వీళ్లతో విజయసాయిరెడ్డి సారా వ్యాపారాలు చేయిస్తూ వారిని వెనకుండి నడిపిస్తున్నారు.ఏపీలో రెండేళ్ల క్రితమే బినామీల పేరుతో అదాన్ డిస్టిలరీస్ ను స్థాపించిన విజయసాయిరెడ్డి వాటి ద్వారా వచ్చిన రూ.2వేల కోట్లను ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈఎండీ లుగా కట్టారు.దీనికి జగన్ రెడ్డికి, వైఎస్ భారతీ కి సంబంధాలున్నాయి.

‘‘విజయసాయిరెడ్డికి – ఢిల్లీ కుంభకోణం కు మద్య సంబంధం ఇలా’’…

‘‘ఢిల్లీలో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణం కేసుకు విజయసాయిరెడ్డి కుటుంబానికి దగ్గర సంబంధాలున్నాయి.ట్రైడెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, తన తమ్ముడు రోహిత్ రెడ్డి అరబిందో గ్రూపుకు కామన్ డైరెక్టర్లుగా ఉన్నారు.

అంతేగాకుండా విజయసాయిరెడ్డి పెట్టిన లిక్కర్ కంపెనీ అదాన్ డిస్టిలరీస్ కు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు.ఈ విధంగా విజయసాయిరెడ్డి తన అల్లుడిని బినామీగా పెట్టుకుని ఏపీలో కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాడు.

అదాన్ డిస్టిలరీస్ కు సంబంధించిన ఒక్క అడ్రస్ లో కూడా డిస్టిలరీ కంపెనీ ఒక్కటి కూడా లేదు.దొంగతనంగా వేర్వేరు డిస్టిలరీల్లో విజయసాయిరెడ్డి తనకు లాభాలు చేకూర్చే కల్తీ మద్యాన్ని తయారు చేయించకుని, అదాన్ డిస్టిలరీస్ పేరుతో ఏపీలో మద్యం వ్యాపారాన్ని చేస్తున్నాడు.ఈ వ్యాపారం ద్వారా ఇప్పటి వరకు రూ.5వేలు కోట్లకు పైబడి టర్నోవర్ జరిగిందని, వీటిలోని కూ.2వేల కోట్లను ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లో ఈఎండీ(ఎర్నస్ట్ మనీ డిపాజిట్)లుగా కట్టారని సీబీఐ తేల్చింది.ఏపీ సమస్యలపై ఢిల్లీలో పోరాడేందుకు విజయసాయిరెడ్డిని ఎంపీని చేస్తే, ఢిల్లీలో సారా వ్యాపారం చేసే బ్రోకర్ లా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు.

‘‘జగన్ కు, భారతికి – ఢిల్లీ కుంభకోణానికి సంబంధం ఇలా’’….

‘‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొన్నారు.

క్విడ్ ప్రో కో 1లో జగతి పబ్లికేషన్స్ కి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించింది.ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ భారతికి సంబంధాలున్నాయని సీబీఐ తన విచారణలో తేల్చింది.

అంతేగాకుండా జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కంపెనీల్లో ట్రైడెంట్ కంపెనీ ఒకటి.అంటే మొత్తంగా ఈ ఢిల్లీ కుంభకోణం మొత్తం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతోందని అర్థమవుతోంది.

అక్రమార్జనకు జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అనే విషయం ప్రపంచానికి తెలుసు.ట్రైడెంట్ కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, తన తమ్ముడు రోహిత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ అధినేత వైఎస్ భారతి ఢిల్లీ కుంభకోణంలో కీలకపాత్రదారులు, సూత్రదారులుగా ఉన్నారు.

త్వరలోనే ఢిల్లీ కుంభకోణంపై సీబీఐ ఛార్జిషీట్లు వేయబోతోంది.దీనిలో జగన్ రెడ్డి కి సంబంధించిన కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు నిందితులుగా తేలతారు’’.

‘‘అరబిందో కంపెనీ అధినేత కుటుంబానికి చిప్పకూడు తప్పదు’’

రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, తన కుటుంబ సభ్యులతో విజయసాయిరెడ్డి సారా వ్యాపారం చేయిస్తున్నాడు.అరబిందో గ్రూపు కంపెనీ మందు బిళ్లలు అమ్ముకునే పద్దతిగల కుటుంబానికి విజయసాయిరెడ్డి శనిలా దాపురించారు.

వాళ్లు విజయసాయిరెడ్డిని నమ్ముకుని అక్రమ వ్యాపారాల్లో తలదూర్చి కేసుల్లో ఇరుకున్నారు.విజయసాయిరెడ్డికి చిప్పకూడా తినడం అలవాటే.

ఇటువంటి వాడిని నమ్ముకుంటే అరబిందో గ్రూపు కంపెనీ అధినేతలు నిత్యానందరెడ్డి, రాం ప్రసాద్ రెడ్డి, తన కుమారులకు కూడా జైల్లో చిప్పకూడా తప్పదని గుర్తు పెట్టుకోవాలి.ఢిల్లీ మద్యం కుంభకోణం నుండి నేటి వరకు జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక విజయసాయిరెడ్డి కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

‘‘వాళ్లెవరో తెలిస్తే సమాచారం ఇవ్వండి’’

ఈ సమాజానికే తెలియని బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశిచాయానుల, ముప్పిడి అవినాష్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తుల పేరుతో అదాన్ డిస్టిలరీలను విజయసాయిరెడ్డి నడుపుతున్నాడు.అసలు వాళ్లు ఎవరు? ఎక్కడున్నారు? ఉంటే బ్రతికే ఉన్నారా? లేక విజయసాయిరెడ్డి వాళ్లను పైకి పంపేశారా అనే అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో విజయసాయిరెడ్డి తన కల్తీ మద్యంతో చెలగాటమాడుతున్నాడు.రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రజలంతా సహకరించాలి.

బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశిచాయానుల అనే వ్యక్తులు ఎవరికైనా తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం’’.

‘‘సీబీఐ కేసును ఏపీకి విస్తరించాలి’’

‘‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తన దర్యాప్తును ఏపీకి విస్తరించాలని టీడీపీ కోరుతోంది.

ఏపీలోని అదాన్ డిస్టిలరీస్, జగతి పబ్లికేషన్స్, జగన్ రెడ్డికి సంబంధించిన విషయాలను కూడా సీబీఐ విచారణ జరిపించాలి.ఢిల్లీ మద్యం కుంభకోణంతో పాటు, ఏపీలో జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంపైనా సీబీఐ నిగ్గుతేల్చాలి.

ఏపీ ప్రజల ప్రాణాలను కాపాడాలి.నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం’’

‘‘జగన్ ఢిల్లీకి వెళ్లింది ఇందుకే.

’’

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఆగమేఘాల మీద ఢిల్లీ పర్యటనకు వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం కాదని తేలింది.ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ విచారణ కొలిక్కి వచ్చింది.

దీనిలో తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా తన భార్య వైఎస్ భారతి కూడా కుంభకోణంలో నిందితురాలిగా తేలే అవకాశం ఉంది.ఈ కేసు నుండి తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు మోడీ కాళ్లమీద పడేందుకు జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.

‘‘దావోస్ పర్యటన కూడా సొంత ప్రయోజనాల కోసమే….’’

‘‘ముఖ్యమంత్రి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అని చెప్పి దావోస్ పర్యటను వెళ్లి, సొంత ప్రయోజనాల విషయాలను జగన్ రెడ్డి చక్కదిద్దుకొచ్చారు.

తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలే ప్రధానంగా దావోస్ పర్యటన కొనసాగింది.ఇలా ప్రతి పర్యటనలోనూ జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల చాటున సొంత ఆర్థిక ప్రయోజనాలను చక్కదిద్దుకొస్తూ ప్రజల కళ్లుకప్పుతున్నారు.

దావోస్ లో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలతో కలిసి జగన్ రెడ్డి ఫోటోలు దిగి, ఈ విషయం ఎవరికీ తెలియదులే అని అనుకుంటున్నారు’’.

‘‘మాధవ్ ను చోటు అనకండి…విప్పి చూపిస్తా అంటున్నాడు.

’’

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వచ్చిన నాటి నుండి పార్లమెంటులో అతన్ని ఎంపీలు చూసి క్యారే చోటు అంటున్నారు.దీంతో అతను సిగ్గుతో కుమిలిపోతున్నాడు.

అంతేగాకుండా విమానాల్లో ఎయిర్ హోస్టెస్ మాధవ్ ను చూసి చోటు అంకుల్ వచ్చాడు అని అంటున్నారు.అంతేగాకుండా విమానాశ్రయాల్లో పిల్లలు మాధవ్ ను చూసి చోటు అంకుల్ వచ్చాడని అంటున్నారు.మాధవ్ ను ఇకమీదట ఎవరూ చోటు.చోటు… అనకండి.మాధవ్ కు కోపం వచ్చి విప్పి చూపిస్తా…విప్పి చూపిస్తా అంటున్నాడు.

‘‘కుప్పంలో వైసీపీ ఓటమి భయంతో కూడిన అసహనం కనిపించింది’’

కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడిని గమనిస్తే వైసీపీ నాయకుల్లో ఓటమి భయం పట్టుకుందని, దీనివల్ల వారిలో వచ్చిన అసహనం కనిపిస్తోందని అర్థమైంది.

ఐప్యాక్ సర్వేల్లో కూడా వైసీపీ రానున్న ఎన్నకల్లో ఓటమిని చవిచూడబోతోందని తేలుతోంది.వైసీపీ చేసిన అరాచకం వల్ల టీడీపీకి మేలు జరిగిందనే నేను భావిస్తున్నాను.టీడీపీ నేలకు కొట్టిన బంతిలా వేగంగా ప్రజల్లోకి దూసుకుపోతోంది.వైసీపీ నాయకులకు దీన్ని చూసి నిద్రపట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube