ఢిల్లీలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకీ ప్రదర్శనకు పోలీసులు అనుమతి రద్దు చేశారు.ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కేదార్ నాథ్ సాహ్ని ఆడిటోరియంలో మునావర్ షో జరగాల్సి ఉంది.అయితే, మత సామరస్యానికి విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఇటీవల హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూకీ షో విజయవంతంగా జరిగింది.వెయ్యి మంది పోలీసులతో, పటిష్ఠ భద్రత నడుమ తెలంగాణ ప్రభుత్వం షో నిర్వహణకు సహకారం అందించిన విషయం తెలిసిందే.







