భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం నేటితో ముగియనుంది.లాస్ట్ వర్కింగ్ డేన ఆయన ఐదు కీలక కేసులపై తీర్పులను వెలువరించనున్నారు.
ఉచిత హామీలతో పాటు మొత్తం ఐదు కేసులపై సీజేఐ విచారణ చేపట్టారు.ఇందులో ఉచిత హామీల వ్యవహారాన్ని త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేశారు.
ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఐదు కేసుల్లో తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది.







