సినీ ప్రపంచం రంగుల ప్రపంచం అని అంటూ ఉంటారు.ఇక్కడ నిలదొక్కుకోవాలంటే కృషి, పట్టుదల, సహనం వంటివి చాలా అవసరం.
ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టార్ అయిపోవాలంటే కష్టం.కొంత మందికి అదృష్టం బాగుంటే అలా మొదటి సినిమాకే సూపర్ హిట్ అందుకుని స్టార్ అయిపోతారు.
కానీ అందరి కెరీర్ ఒకేలా ఉండదు.ఎన్నో సినిమాలు చేస్తే కానీ గుర్తింపు రాదు.అందులోను ఇండస్ట్రీలో గాడ్ ఫాథర్ లేకుండా కెరీర్ కొనసాగించడం కష్టం.అయితే కొంత మంది మాత్రం తమ స్వయంకృషితో, అదృష్టం తోడవ్వడంతో గాడ్ ఫాథర్ లేకపోయినా స్టార్ హీరోగా నిలదొక్కుకుంటారు.
మెగాస్టార్, సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి వారు అప్పట్లో స్టార్ హీరోలుగా ఎదిగి సంచలనం సృష్టించారు.
ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ, విజయ్ దేవరకొండ ఇంకా యంగ్ హీరోలు కొంత మంది అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే.
ఇక ఇప్పుడు మనం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ గురించి చెప్పుకుందాం.యంగ్ హీరో నిఖిల్ నితిన్ సినిమా సంబరం సినిమాలో చిన్న రోల్ చేసాడు.
ఈ సినిమాకు ఈయన అందుకున్న ఫస్ట్ పారితోషికం అక్షరాలా 112 రూపాయలు.
ఆ తర్వాత నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమాలో చిన్న రోల్ చేయడమే కాదు.
ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు.ఆ హ్యాపీ డేస్ సినిమాలో నటించి గుర్తింపు పొందాడు.
ఈ సినిమా తర్వాత నిఖిల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది.వరుసగా చిన్న చిన్నగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ గా ఎదిగాడు.
ఈయన కెరీర్ లో కార్తికేయ మంచి హిట్ అయ్యి ఈయన రేంజ్ ను మరింతగా పెంచేసింది.ఇక ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.

ఏకంగా 100 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు రెండు వారాలు అవుతున్న ఇంకా ఏమాత్రం హైప్ తగ్గడం లేదు.ఓవర్సీస్ లో కూడా 1.4 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసి ఇంకా 100కు పైగా థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రేంజ్ కు ఎదగడం నిజంగా కొత్త తరం వారికీ స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిఖిల్ జర్నీ అందరికి తెలియజేస్తుంది.







