మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అవసరం లేదు.ఈమె నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై వ్యాఖ్యాతగా నటిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సినిమాలపై ఉన్న వ్యామోహంతో ఈమె వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారిపోయారు.ఇలా పలు వెబ్ సిరీస్ ల నిర్మాణంతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న నిహారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నిహారిక సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా ఆ పోస్ట్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతుంది.అయితే వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈమె సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నిహారిక ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె నిత్యం జిమ్ లో వర్కౌట్ చేస్తూ బిజీగా గడుపుతుంటారు.అయితే తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
గతంలో తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అధి కాస్తా తీవ్ర దుమారం రేపింది.అయితే తాజాగా తన భర్తతో కలిసి జిమ్ లో ఈమె వర్కౌట్స్ చేసిన అనంతరం ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.