ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ అయిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని.ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి.రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.అయితే పాత చనువుతోనే ఇలా మాట్లాడుతున్నారా.? లేక ఎన్టీఆర్ రాజకీయాకు నాని అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా.అనే మాటలు వినిపిస్తున్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ సినీ నటుడు.సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ కి రాజకీయ వాసనలు కూడా ఉన్నాయి.
అలాగే టీడీపీ తరఫున ప్రచారం కూడా 2009 ఎన్నికల్లో చేశారు.అయితే జూనియర్ రీసెంట్ గా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మీద జోరుగా చర్చ సాగుతోంది.
ఆసక్తికరంగా నాని వ్యాఖ్యలు…
అయితే అమిత్ షా జూనియర్ ల భేటీలో ఏమి మాట్లాడుకున్నారో వాళ్లు చెప్తేనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.
అమిత్ షా అయితే ఎక్కడా పెదవి విప్పలేదు.ఇక జూనియర్ కూడా సైలెంట్ గానే ఉన్నారు.
దీంతో ఎన్నో కథనాలు వినిపించాయి.అయితే ప్రస్తుతం కొడాలి నాని మాటలు చర్చనీయాంశంగా మారాయి.
మూడు రోజులుగా జూనియర్ రాజకీయాల గురించి వరసబెట్టి మరీ మాట్లాడుతూ మీడియాకు కావాల్సిన మసాలా అందిస్తున్నారు.జూనియర్ తో అమిత్ షా మీటింగ్ పూర్తి రాజకీయం కోసమే సాగిందని పాన్ ఇండియా స్టార్ గా ఉన్న జూనియర్ సేవలను బీజేపీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చారు.
ఇక రెండో రోజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ దే టీడీపీ అన్నట్లుగా మాట్లాడారు.చంద్రబాబు ఆ పార్టీని లాక్కున్నారు అని కూడా సెటైర్లు వేశారు.ఇక ఇప్పుడు మళ్లీ ఎవరో ఏదో అడిగారని.అన్నారని.జూనియర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని సరైన టైమ్ లో జూనియర్ టీడీపీని టేకోవర్ చేసుకుంటారని అన్నారు.అపుడు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని కూడా చెప్పారు.
ఆ విధంగా చూస్తే చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే అని కూడా నాని జోస్యం చెప్పారు.దీంతో నాని చేస్తున్న కామెంట్స్ అన్నీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కి ఆయన అధికార ప్రతినిధిగా మారిపోయారా.? అన్న చర్చ సాగుతోంది.
జూనియర్ కి కొడాలికి ఆ మధ్యనే గ్యాప్ వచ్చింది అని అంతా అనుకున్నారు.
అయితే ఇపుడు జూనియర్ అమిత్ షా తో భేటీ తర్వాత కొడాలి పాత నానిగా మారి జూనియర్ విషయంలో కొంత సానుకూలతతో మాట్లాడుతున్నారని అంటున్నారు.మొత్తానికి జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని టీడీపీ పగ్గాలు తీసుకుంటాడని అయితే దానికి బాగా టైమ్ ఉందని.
ఇలా అన్నీ నాని చెబుతుండటం చర్చకు దారితీసుస్తున్నాయి.అయితే ఇదంతా పాత స్నేహంతోనే చెబుతున్నారా…మరింత చనువు తీసుకుంటున్నారా.? అనే మాటలు వినిపిస్తున్నాయి.