ఈ మధ్య ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా రిలీజ్ అవుతుంది అంటే నెల రెండు నెలలు ముందు నుండే సినిమా ప్రొమోషన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.ఇది మంచి విషయమే కానీ.
మరీ సినిమాలు తీయడం కంటే ప్రొమోషన్స్ చేయడం పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు మేకర్స్.పబ్లిసిటీ ఎంత చేస్తే అంత వసూళ్లు రాబట్టవచ్చు అనే అభిప్రాయం బలంగా పడడంతో మేకర్స్ కూడా ఇదే దిశగా పయనిస్తున్నారు.
వరుస ప్రొమోషన్స్ చేస్తేనే ఆడియెన్స్ ఆ సినిమా చూసేందుకు థియేటర్ వరకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అలానే ప్రొమోషన్స్ ఎంత చేస్తే అంత సినిమా ఓపెనింగ్స్ రాబట్ట వచ్చని సినిమాలో కంటెంట్ ఉందో లేదో చేసుకోకుండానే పబ్లిసిటీ చేసి వసూళ్లు రాబట్ట వచ్చని అభిప్రాయానికి వచ్చారు.
అయితే సినిమాకు పబ్లిసిటీ చేయకపోతే హిట్ సినిమా కూడా ప్లాప్ అవుతుంది అని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.
కానీ పబ్లిసిటీ లేకపోయినా హిట్ అయ్యి మంచి కంటెంట్ తో భారీ వసూళ్లు కూడా రాబట్టిన సినిమాలు ఉన్నారు.
అవి ఇటీవలే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతల జేబులు నింపాయి.వాటిలో ముఖ్యంగా పుష్ప ది రైజ్ తో పాటి గత వరం వచ్చిన కార్తికేయ 2 ఉన్నాయి.
ప్రొమోషన్స్ కే కోట్ల రూపాయలు పెట్టిన సినిమాలు ఉండగా ఈ రెండు సినిమాలు మాత్రం అసలు ఏ మాత్రం ప్రోమోట్ చేయకుండా లాభాలు తీసుకు వచ్చాయి.పుష్ప, కార్తికేయ 2 రెండు కూడా కేవలం మాత్ టాక్ తోనే ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుని మెల్ల మెల్లగా కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయి.
పుష్ప 100 కోట్లు రాబట్టి అక్కడి వారిని సైతం ఆశ్చర్య పరిచింది.

ఇక ఇటీవలే వచ్చిన కార్తికేయ 2 చిన్న సినిమాగా ఎటూవంటి అంచనాలు లేకుండా వచ్చి 20 కోట్లు వసూళ్లు చేసింది.ఒక చిన్న సినిమా ఇన్ని కోట్లు వసూళ్లు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.అయితే ఈ రెండు సినిమాలు మంచి కంటెంట్ తో రావడంతో అక్కడి ప్రేక్షకులను సైతం మెప్పించాయి.
అందుకే కంటెంట్ ఉంటే పబ్లిసిటీకి కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే భారీ విజయాలు పొందవచ్చు అని నిరూపించాయి.







