ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.
రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోయింది.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నారు అంత ప్లాప్ అయ్యింది.అయితే ఈ సినిమా ఇంత ప్లాప్ అవ్వడానికి కారణాలు చాలానే చెబుతున్నారు.
ముఖ్యంగా హీరోయిన్ కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యింది అంటున్నారు ప్రేక్షకులు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
అయితే ఈమె మాత్రం దారుణంగా నిరాశ పరిచింది.ఈమె తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఫ్రేస్టేట్ అవుతున్నారు అంటేనే అర్ధం అవుతుంది ఈ అమ్మడు ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో.
ఈ సినిమాలో ముందుగా ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకోలేదట.పూరీ జగన్నాథ్ కియారా ను కానీ, జాన్వీ కపూర్ ను కానీ తీసుకోవాలి అనుకున్నాడట.
కానీ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అనన్య పాండే ను తీసుకోవాలని ఒత్తిడి చేశారట.దీంతో ఆయన మాట కాదు అనలేక ఈ సినిమాలో అనన్య ను తీసుకున్నాడు పూరీ.
కానీ ఈమె ఈ సినిమాకు ఏ మాత్రం ప్లస్ అవ్వలేక పోయింది.
ఒక్క రొమాంటిక్ సాంగ్ లో తప్ప ఈమె ఆకట్టుకుంది లేదు అని ప్రేక్షకులు చెబుతున్నారు.సినిమా చూసిన వారందరు అంటున్న ఒకే మాట ఈమె అస్సలు మెప్పించలేక పోయింది అని.అందులోను పూరీ విజయ్, అనన్య మధ్య తీసిన లవ్ స్టోరీ వల్ల కూడా ప్రేక్షకులకు విసుగు వచ్చేసింది.ఈమె నటించే సన్నివేశం కనిపిస్తే చాలు వద్దు బాబోయ్ అంటున్నారు సగటు ప్రేక్షకులు.దీంతో టాలీవుడ్ లో ఈమె రాణించలేదు అనే విషయం అర్ధం అవుతుంది.ఈమె హావభావాలు కూడా పెద్దగా పలికించలేక పోవడం మైనస్ అయ్యింది.ఏ సీన్ లో చూసిన తన ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ అనేదే లేదు.
దీంతో ఈమె సినిమాకు పెద్ద మైనస్ అని చెబుతున్నారు.