సినిమా ఎలా ఉంటుందో కానీ ప్రమోషన్స్ మాత్రం సూపర్‌ హిట్‌

గత రెండు వారాలుగా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ హడావుడి కనిపిస్తుంది.ముఖ్యంగా యూట్యూబ్‌ లో ఈ సినిమా యూనిట్‌ సభ్యుల యొక్క వీడియో లు.

 First Day First Show Movie Promotional Interviews Anudeep Kv , First Day First-TeluguStop.com

ఇంటర్వ్యూలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.అల్లు అరవింద్ వద్దకు వెళ్లి చిచ్చోర బ్యాచ్ లా మాట్లాడి సినిమా ను జనాల్లోకి తీసుకు రావడం లో సఫలం అయ్యారు.

పూర్ణోదయ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమా లు వచ్చాయి.స్వాతిముత్యం.శంకరాబరణం వంటి సినిమా లు పూర్ణోదయ బ్యానర్‌ లో వచ్చాయి.ఇప్పుడు ఈ సినిమా కూడా అదే బ్యానర్‌ లో అవ్వడంతో ఆసక్తి ఉంది.

కానీ ఈ సినిమా కోసం దర్శకుడు అనుదీప్‌ కథను అందించాడు అంటూ అధికారికంగా బయటకు వార్తలు రావడంతో ఆసక్తి మరింతగా పెరిగింది.జాతిరత్నాలు సినిమా తో అనుదీప్ స్థాయి ఒక్కసారిగా పెరిగి పోయిన విషయం తెల్సిందే.

ఆయన కథ అంటే చాలా యూనిక్ గా కామెడీ గా ఉంటుంది అనడం లో సందేహం లేదు.ఇక జాతిరత్నాలు సినిమా సమయంలో తనకు అసిస్టెంట్‌ గా చేసిన వంశీధర్ గౌడ్ ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

వంశీధర్ మరియు అనుదీప్ లు సోషల్‌ మీడియా లో ముఖ్యంగా యూట్యూబ్‌ లో సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూలు సూపర్ హిట్‌ అయ్యాయి.ఇంటర్వ్యూలకు లక్షల్లో వ్యూస్ మరియు లైక్స్ వస్తున్నాయి.

వీరిద్దరు అల్లు అరవింద్ మరియు వెన్నెల కిషోర్‌ తో చేసిన సందడి అంతా ఇంతా కాదు.అందుకే ఈ సినిమా గురించి ప్రముఖ గా చర్చ జరిగింది.

సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ వారు ప్రమోషన్ చేస్తున్న తీరు మాత్రం నిజంగా హ్యాట్సాప్‌.ఒక చిన్న సినిమా కు ఈ స్తాయి లో బజ్‌ రావడం కు కారనం వారు చేసిన సూపర్‌ హిట్‌ పబ్లిసిటీ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే సెప్టెంబర్‌ 2 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube