యువ హీరో నిఖిల్ పేరు ఇప్పుడు దేశమంతా మారు మ్రోగుతుంది.చందు మొండేటి డైరక్షన్ లో నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది.సినిమా అక్కడ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, హర్ష కూడా నటించారు.
ఈ సినిమా కోసం నిఖిల్ రెమ్యునరేషన్ గా 3 కోట్లు తీసుకున్నాడని తెలుస్తుంది.హిందీలో ఈ సినిమా ఇంత భారీగా హిట్ అవుతుందని ఊహించలేదు.
ఈ రేంజ్ లో హిట్ అయ్యింది కాబట్టి నిఖిల్ కి లాభాల్లో కూడా కొంత వాటా ఇచ్చే ఛాన్స్ ఉంది.కార్తికేయ 2 ద్వారా నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరోగా మారాడు.
కార్తికేయ 3కి భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.పార్ట్ 3 మరింత గ్రాండియర్ గా అద్భుతంగా ఉంటుందని డైరక్టర్ చందు చెబుతున్నారు.
మొత్తానికి కార్తికేయ ఫ్రాంచైజీ సూపర్ క్లిక్ అయ్యిందని చెప్పొచ్చు. పార్ట్ 3 కోసం ఇప్పటికే ఓ హింట్ ఇవ్వగా మూడవ భాగం మరింత క్రేజీగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు.







