సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘జనగణమణ‘.పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా విజయ్ తో చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా రేపు గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
దీంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్నారు.అందుకే ప్రస్తుతానికి జనగణమణ సినిమాను పక్కన పెట్టేసారు.
ఆర్మ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈమె JGM టీమ్ తో జాయిన్ అయినట్టు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
ఇప్పటికే ఒక షెడ్యూల్ సైతం పూర్తి చేసినట్టు వార్తలు వచ్చాయి.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో వార్త బయటకు వచ్చింది.

ఇది ఆర్మ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో భారీ విజువల్స్ ఉండబోతున్నాయట.అందుకే ఈ సినిమాకు లైగర్ ఫలితంతో సంబంధం లేకుండా ఖర్చు చేయనున్నారట.దాదాపు 100 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం పెడుతున్నట్టు ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమాను పూరీ సొంత బ్యానర్ తో పాటు.
వంశీ పైడిపల్లి కూడా నిర్మాతగా మారబోతున్నారు.

ఈయన నిర్మాతగా తొలి సినిమాకే భారీగా ఖర్చు చేస్తున్నారు.పూరీ పై నమ్మకంతో పాటు, విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా వంశీ నిర్మాతగా మారడానికి కారణం.ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో కూడా ఉండనుందని.
దడపా 5 నెలల పాటు షూటింగ్ కే పడుతుందని.ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ప్రకటించిన విషయం విదితమే.వచ్చే ఏడాది 2023 ఆగష్టు 3న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.







