సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’.ఈ సినిమాపై అన్ని చోట్ల అంచనాలు పెరిగి పోయాయి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నప్పటికీ ఈయన క్రేజ్ మాత్రం పాన్ ఇండియా స్టార్ లాగా ఉంది.గత సినిమా ప్లాప్ అయినప్పటికీ విజయ్ కు ఇంత క్రేజ్ పెరగడం స్టార్ హీరోలు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ సినిమా టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి తన బెస్ట్ విషెష్ అందించాడు.
రేపు లైగర్ డే అని.ఇది పరిశ్రమ అందరికి నచ్చుతుంది అని.నాకౌట్ పంచ్ కోసం వెళ్ళండి అని మెగాస్టార్ చెబుతూ గాడ్ ఫాథర్ సెట్స్ లో లైగర్ టీమ్ తో దిగిన ఫోటోను షేర్ చేసాడు మెగాస్టార్.ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగడం.అందులోను సోలోగా రిలీజ్ అవ్వడంతో ఓపెనింగ్స్ కుమ్మేయ బోతుంది.చూడాలి ఎంత పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతుందో.ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.







