టెన్షన్ పెట్టిస్తున్న భేటీలు ! అలజడి లో ఏపీ రాజకీయం ? 

ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా,  అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే హడావుడి ప్రారంభించాయి.

రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు పక్కగా ప్రణాళికలు రచిస్తూ, తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.తమకు కలిసి వచ్చే అన్ని అంశాల పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాయి.

ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు కొన్ని కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి.ఇక కేంద్ర అధికార పార్టీ బిజెపి దూకుడు పెంచింది.

ఏపీ, తెలంగాణ రాజకీయాలకు కలిసి వచ్చే విధంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.ఫిలిం సిటీకి వెళ్లిన అమిత్ షా ఏపీ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక అంశాలపై రామోజీరావుతో చర్చించారు.

అలాగే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనానికి కారణం అయింది.జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ అభినందన విందు అని చెబుతున్నప్పటికీ , దీంట్లో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనే అభిప్రాయంలో అంతా ఉన్నారు.

ఈ భేటీ అనంతరం ఏపీ సీఎం జగన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశం అయ్యారు.జగన్ మోదీ ఏ అంశాల గురించి చర్చించారు అనేది స్పష్టత లేనప్పటికీ, ఏపీలో పొత్తుల అంశం పైన, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం .ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో టిడిపి వైసిపిలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అంటూ పవన్ ప్రకటించారు.అయితే ఎన్నికల సమయం నాటికి పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని టిడిపి, బిజెపిల తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు ఉన్నాయి.
 

Telugu Amith Sha, Ap Bjp, Ap, Congress, Jagan, Telangana, Ysrcp-Politics

 టిడిపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకుల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లుగా కనిపిస్తున్నారు.టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో టిడిపి, బిజెపిల పొత్తు ఖచ్చితంగా ఉంటాయి అనే అంచనాలు అందరిలోనూ నెలకొన్నాయి.ఇదే అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్  కూడా చేశారు.టిడిపి బిజెపిలు పొత్తు పెట్టుకోవడం అనేది వారి ఇష్టమని ప్రకటించారు.ప్రస్తుతం ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు వ్యవహారాలే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube