ఈ మొసలి ఎలా పరిగెడుతుందో చూడండి.. రన్నింగ్ రేస్ పెడితే మెడల్ ఖాయం..!

క్రూరమైన జంతువులలో మొసలి అత్యంత ప్రమాదకారిగా పేరు తెచ్చుకుంది.దీని బలమైన పళ్లు, దృఢమైన దవడలు దేన్నైనా చీల్చి చెండాడుతాయి.

 See How This Crocodile Runs If You Run A Running Race, You Will Get A Medal ,cro-TeluguStop.com

చాలా దూకుడుగా ఉండే ఈ మాంసాహార జీవులు మనుషులపై కూడా దాడి చేస్తాయి.క్షణ కాలంలోనే చేతులు, కాళ్లు కొరికేసి ఇవి తినగలవు.

అందుకే వీటిని చూస్తేనే వెన్నెముకలో వణుకు పుడుతుంది.ఆ పదునైన దంతాలు, భారీ దవడలు, భయంకరమైన చూపులు ఫేస్ టు ఫేస్ చూస్తే గుండె ఆగిపోతుంది.

అలాంటిది అది మన వెనకే అత్యంత వేగంగా పరిగెడుతూ వస్తుందని తెలిస్తే ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదూ.

కాగా ఇటీవల ఒక భారీ మొసలి ఒక వ్యక్తి వెనక చాలా వేగంగా పరుగెత్తింది.అతడిని అందుకుని కరకరా నమిలి మింగేయాలని అనుకుంది.దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు.ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో ఒక ఎన్‌క్లోజర్‌లో ఒక వ్యక్తి, ఒక భారీ మొసలి ఉన్నట్లు గమనించవచ్చు.

ఈ మొసలి చాలా వేగంగా అతడిని పట్టుకోవడానికి నోరు తెరిచి తీసుకొచ్చింది.మృగం దాని గోళ్లపై నిలబడి మరీ ఎదుర్కొంటూ వచ్చింది.ఒక కుక్క లాగా అది పరిగెత్తింది.“మొసలి ఇంత వేగంగా దూసుకుపోవడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు” అని సుశాంత నంద క్యాప్షన్ జోడించారు.

ఇది ఒక క్యూబన్ క్రొకోడిల్ అని, కొంత దూరం వరకు ఇవి చాలా వేగంగా పరిగెత్తగలవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.బహుశా ఈ మొసలి ఆ యువకుడిపై పగ పట్టిందేమో.అందుకే అది అలా వేగంగా పరిగెడుతుందని ఇంకొక నెటిజన్ అన్నారు.ఈ భయంకరమైన వీడియో పైన మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube