పెళ్లొద్దు.. బాయ్ ఫ్రెండ్ కావాలి.. సురేఖా వాణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి సురేఖా వాణికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.సినిమా అవకాశాలు తగ్గినా ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీ ఉండటంతో సురేఖావాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

 Surekha Vani Shocking Comments About Boy Friend Goes Viral In Social Media , Su-TeluguStop.com

మోడ్రన్ డ్రెస్ లలో సురేఖావాణి షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో సురేఖావాణి షాకింగ్ కామెంట్లు చేశారు.

నాకు ప్రస్తుతం రెండో పెళ్లిపై ఆసక్తి లేదని ఆమె కామెంట్లు చేశారు.కానీ నా కూతురు సుప్రీత మాత్రం నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని సూచిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇప్పుడైతే రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి అంటూ సురేఖా వాణి చెప్పుకొచ్చారు.నచ్చిన వ్యక్తి దొరికాడా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఇప్పటికి అయితే ఎవరూ దొరకలేదని సురేఖా వాణి అన్నారు.

Telugu Marrege, Supritha, Surekha Vani, Tollywood-Movie

అయితే నాకు బాయ్ ఫ్రెండ్ కావాలని అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ బాయ్ ఫ్రెండ్ నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలని ఆమె కామెంట్లు చేశారు.మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నాకు బాయ్ ఫ్రెండ్ గా కావాలని నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యే వ్యక్తికి లైట్ గా గడ్డం ఉండాలని ఆమె తెలిపారు.

ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలని ఆమె కామెంట్లు చేశారు.అలాంటి వ్యక్తి దొరకడంతో పాటు నాకు నచ్చితే అతనినే పెళ్లి చేసుకుంటానని ఆమె కామెంట్లు చేశారు.

సురేఖావాణి చేసిన కామెంట్లను కొంతమంది నెటిజన్లు మెచ్చుకుంటుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు.సురేఖావాణి కూతురు మాత్రం ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube