సహజనటి జయసుధ తెలుగులో వందల సంఖ్యలో సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా విజయాలను సొంతం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఆమె అసలు పేరు సుజాత కాగా పండంటి కాపురం అనే సినిమాతో జయసుధ కెరీర్ మొదలైంది.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన 25 సినిమాలలో, దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన 27 సినిమాలలో జయసుధ నటించి మెప్పించారు.
జయసుధ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నంది పురస్కారాలు, ఇతర పురస్కారాలను అందుకున్నారు.
ప్రస్తుతం హీరోలకు అమ్మ, అమ్మమ్మ తరహా పాత్రలలో నటిస్తూ జయసుధ మెప్పిస్తున్నారు.తాజాగా జయసుధ శోభన్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షోకు జయసుధ గెస్ట్ గా హాజరయ్యారు.ఈ షోకు జయసుధతో పాటు ఆమని, సంఘవి, ఖుష్బూ కూడా హాజరు కావడం గమనార్హం.

షోలో శోభన్ బాబు ఫోటో చూపించగానే ఆయన గురించి ఏం చెప్పాలని హీ ఈజ్ ఏ డార్లింగ్ అంటూ జయసుధ చెప్పుకొచ్చారు.కృష్ణ ఫోటో చూపించగానే అందరితో ఎక్కువగా యాక్ట్ చేశానని కృష్ణగారితో మాత్రం తక్కువగా యాక్ట్ చేశానని అన్నారు.ఎందుకంటే ఆయన నా అంకుల్ కాబట్టి అని జయసుధ చెప్పుకొచ్చారు.నటిగా జయసుధ 50 సంవత్సరాల కెరీర్ ను పూర్తి చేసుకోవడంతో ఆమెతో ఈ షోలో కేక్ కట్ చేయించారు.
ఈ ప్రోమోకు 65,000కు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ నెల 27వ తేదీన ఈ ఎపిసోడ్ టీవీలో ప్రసారం కానుందని తెలుస్తోంది.జయసుధ గారు టీవీ షోకు రావడం సంతోషంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గత కొన్నేళ్లుగా ప్రసారమవుతున్న క్యాష్ షోకు బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే.







