ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలను చూసే విషయంలో పూర్తిస్థాయిలో మారిపోయారు.సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే థియేటర్లలో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
పెద్దపెద్ద స్టార్ హీరోలు నటించిన రొటీన్ కథలతో తెరకెక్కితే ఆ సినిమాను ఫ్లాప్ చేస్తున్నారు.కొత్తదనంతో తెరకెక్కిన కథలకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎక్కువగా ఓటేస్తున్నారు.
అయితే చిరంజీవి మాత్రం రొటీన్ కథలను ఎంపిక చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే.
టీజర్ లో కొత్తదనం ఏ మాత్రం లేదని రొటీన్ మాస్ మసాలా సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ సంతృప్తితో లేరు.
బాబీ ప్రాజెక్ట్ విషయంలో మాత్రమే ఫ్యాన్స్ కొంతమేర సంతృప్తితో ఉన్నారు.
గాడ్ ఫాదర్ లూసిఫర్ రీమేక్ కాగా భోళా శంకర్ వేదాళం సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే.
ఈ రీమేక్ లను ఇప్పటికే ఓటీటీలలో, యూట్యూబ్ లలో ప్రేక్షకులు చూసేశారు.ఇప్పటికే చూసేసిన సినిమాలలో ఎన్ని మార్పులు చేసినా ప్రేక్షకులకు సినిమాలు నచ్చుతాయా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.
చిరంజీవి కథల విషయంలో మారాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడానికి ఆ సినిమా రొటీన్ మాస్ మసాలా సినిమా కావడమే కారణమనే సంగతి తెలిసిందే.చిరంజీవి ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.చిరంజీవి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.
చిరంజీవి సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.







