లైగర్ తో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో తను చేస్తున్న ఖుషి సినిమా విశేషాలను కూడా పంచుకున్నాడు.శివ నిర్వాణ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమా క్రేజీగా ఉండబోతుందని అంటున్నాడు విజయ్.
అంతేకాదు ఆ సినిమా టైటిల్ పెట్టినందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా గర్వపడేలా ఆ సినిమా ఉంటుందని కూడా చెప్పాడు మన రౌడీ బోయ్.
విజయ్ సినిమాకు ఖుషి అని పెట్టగానే మొదట్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ చేశారు.
అయితే ఎలాగోలా గొడవ సర్ధుమనిగినా సరే మళ్లీ రిలీజ్ టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా హడావిడి చేసే ఛాన్స్ ఉంది.అందుకే వారిని టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు.
ఖుషి సినిమా తప్పకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గర్వపడేలా చేస్తుందని అన్నారు.ఈ ఒక్క మాటతో ఖుషి సినిమా మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా చేశాడు విజయ్ దేవరకొండ.







